ఐటిఐ అడ్మిషన్లకై దరఖాస్తుల స్వీకరణ

ఐటిఐ అడ్మిషన్లకై దరఖాస్తుల స్వీకరణ

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: 2023 - 24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐలలో అడ్మిషన్లకై ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ఐటిఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లలమర్రి వెంకటేశం తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ మొదటి విడతగా మే 17, 2023 నుండి జూన్ 10, 2023 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని (https/iti.telangana.gov.in) ఆయన తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో 3, స్టేషన్ ఘన్ పూర్ లో 2, పాలకుర్తి 1, బచ్చన్నపేట 1 మొత్తం 7 ఐటిఐలు ఉన్నట్టు తెలిపారు. ఆయన వెంట జి. చెన్నయ్య, బి శ్రీమన్నారాయణ, ఏ.కీమ్ల, పి.సాయి వైష్ణవ్, స్వామి శంకర్, రాజు ఉన్నారు.