ఇస్రో రాకెట్​  ప్రయోగం సక్సెస్ 

ఇస్రో రాకెట్​  ప్రయోగం సక్సెస్ 

జీఎస్​ఎల్​వీ ఎఫ్​ 12 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 2వేల 232 కిలోల బరువుతో ఎన్​వీఎస్​ -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్​ఎల్​వీ  నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది.. ఇస్రో ప్రయోగం సక్సెస్ కావడంతో  శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. అమెరికా అందిస్తున్న జీపీఎస్​  తరహా నేవిగేషన్ కోసం భారత్‌ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఐఆర్​ఎన్​ఎస్​ఎస్​ నావిక్. అందులో భాగంగానే ఎన్​వీఎస్​ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు.  ఐఆర్​ఎన్​ఎస్​ఎస్​ మొత్తం ఏడు ఉపగ్రహాల ప్రయోగం. ఇందులో భాగంగా గతంలో పంపిన నాలుగు ఉపగ్రహాల జీవితకాలం ముగిసింది.

సో.. వాటికి కొనసాగింపుగా  ఐఆర్​ఎన్​ఎస్​ఎస్​ రెండో తరం నేవిగేషన్‌ శాటిలైట్ సిరీస్‌లో ఇప్పుడు పంపుతున్న ఎన్​వీఎస్​-1 మొదటిది. మొత్తం ప్రయోగాల ప్రక్రియ మొత్తం ఇప్పటి వరకూ జీపీఎస్‌పై ఆధారపడిన మనం ఇకపై దేశీయ నేవిగేషనల్ సేవలు పొందొచ్చు. భారత రక్షణరంగానికి, పౌర విమానయాన రంగానికి ఇస్రో అభివృద్ధి చేస్తున్న ఐఆర్​ఎన్​ఎస్​ఎస్​ ఎంతో మేలు చేయబోతోంది. ఇందులో   రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో  ఎన్​వీఎస్​1  మొదటిది. గతంలో నావిగేషన్‌ సర్వీసెస్‌ కోసం పంపిన ఐఆర్​ఎన్​ఎస్​ఎస్​ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్‌వీఎస్‌ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.. ఇక ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ సిరీస్‌లో మరిన్ని శాటిలైట్లు ప్రవేశపెడతారు.