సంక్షేమ పథకాలతో సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య

సంక్షేమ పథకాలతో సన్నద్ధం కావాలి: ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ క్లస్టర్ ఆత్మీయ సమావేశం పల్లగుట్టలో శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఉచిత కరెంటు, సాగునీరు, త్రాగునీరు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్, దళిత బంధు, గృహలక్ష్మి మొదలైన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది అన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించేందుకు టిఆర్ఎస్ పార్టీని కాస్త బిఆర్ఎస్ గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మన అండదండలు మెండుగా ఉండాలన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు బొమ్మిశెట్టి సరిత, రడపాక సుదర్శన్, జడ్పిటిసి మరపాక రవి, వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి బాలరాజు, ఆకుల కుమార్, మహేందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, రంగు రమేష్, ఎంపీటీసీ ఝాన్సీ, దిశా కమిటీ సభ్యుడు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

“గేటుకు తాళం వేసి ఆడుకున్నారు”
  టిఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో వక్తలు మాట్లాడుతుండగా పలువురు మహిళలు సమావేశ ప్రాంగణం నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక నాయకులు కొందరు గేటుకు తాళం వేసి బయటకు వెళ్లకుండా మరి అడ్డుకున్న.