దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: బతుకమ్మ పండుగ ఊరు వాడ పల్లె, పట్టణాలు దాటి ఖండాంతరాలు చేరింది. (యు.ఏ.ఈ) దుబాయ్ బతుకమ్మ ఆట పాటలతో మారుమోగింది. గల్ఫ్ తెలంగాణా ఫోరమ్(జిటిఎఫ్) అధ్యకులు ఆకుల సురేందర్, యూజువేందర్, వెంకటేష్, జెగన్, రాజేశ్వర్, సురేష్, సుఫియాన్ అద్వర్యంలో దుబాయ్ లో ఆల్ మాం జార్ టేబుల్ టెన్నిస్ అకాడమీ మన బతుకమ్మ పండుగ కు వేదిక అయింది. తెలంగాణా ఆడబిడ్డలు, అక్కా, చెల్లెళ్లు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో గౌరమ్మ ను కొలుస్తూ బతుకమ్మ ఆట పాటలతో ఆడి, పాడి సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ తెలంగాణా ఫోరమ్ మహిళా సభ్యులు ప్రత్యేకంగా ప్రదర్శించిన నృత్యాలు  ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మ్యూజికల్ లైవ్ ఫోక్ సింగింగ్ పెరఫార్మెన్, డీజే చప్పుళ్లతో బతుకమ్మ ప్రాంగణం వేలాదిగా తరలివచ్చిన జనంతో కోలాహలంగా మారింది. మైవిలేజ్ షో గంగవ్వ టీమ్, తెలంగాణా నృత్య కళాకారులు, గాయకులు ప్రత్యేక అతిధులు అలరించారు. కార్యక్రమానికి యుఏఈ లోని అన్ని ప్రాంతాలనుండి తెలంగానీయులు 8 వేల వరకు భారీగా తరలి వచ్చారు.