జర్నలిస్టుల రక్షణ చట్టాలను అమలు చేయాలి

జర్నలిస్టుల రక్షణ చట్టాలను అమలు చేయాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జనగామ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : జర్నలిస్టుల రక్షణ చట్టాలను అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జనగామ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి అనంతరం పలు డిమాండ్లతో వినతి ప్రతాన్ని అందజేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో మీడియా వ్యవస్థకి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో  ప్రభుత్వాలు మారినా మీడియా రక్షణ చట్టాలు తీసుకురావడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని మీడియా రక్షణ చట్టాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులందరికీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని, వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి సురిగెల భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్  హింగె మాధవరావు, కోశాధికారి ఓరుగంటి సంతోష్, టెంజు జిల్లా అధ్యక్షుడు కెమిడి ఉపేందర్, సీనియర్ నాయకులు అశోక్, కొత్తపల్లి కిరణ్, వంగ శ్రీకాంత్‌రెడ్డి, సద్దనపు భాస్కర్, ఉప్పలంచి నరేందర్, ఉపేందర్, బొమ్మగాని శ్రీకాంత్ గౌడ్‌, రాణాప్రతాప్, జైపాల్ రెడ్డి, భాస్కర్, ఆశిష్, రవీందర్, మణి కుమార్, రాజు, కృష్ణ, గోవర్ధనం వేణుగోపాల్, కిరణ్, రచ్చ మోహన్ తదితరులు పాల్గొన్నారు.