ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బిఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా

ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బిఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా

ముద్ర సిరిసిల్ల టౌన్ ;     
గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయాలని, పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై నియమకాల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయించాలని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ శాంతియుతంగా  చేపట్టిన దీక్షను భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆద్యక్షులు వర్ధవెళ్ళి స్వామిగౌడ్ ఆద్వర్యంలో జిల్లా కేంద్రం లోని అంబెడ్కర్ సర్కిల్ లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అంకని భాను మాట్లాడుతూ గ్రూప్ వన్ లో పేపర్ లీకేజ్ అయిన పరీక్షలను రద్దు చేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్ లో జరిగిన అవకతవకలపై  దర్యాప్తు చేయించాలని, టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావులను వెంటనే తొలగించి నూతన బోర్డులను ఏర్పాటు చేయాలని, సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు, అరెస్టు చేసిన  ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, బిఎస్పీ నాయకులను, కార్యకర్తలను వెంటనే  విడుదల చేయాలని డిమాండ్ చేశారు,


బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు వర్ధవెల్లి  స్వామిగౌడ్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన అవినీతి కేంద్రీకృతమై సాగుతుందని అవినీతి మయమైన కె సి ఆర్ రాష్ట్రాన్ని పాలించే అర్హతను కోల్పోయారని, గ్రూప్ -1 పరీక్ష పత్రాల లీకేజిపై స్వతంత్ర సంస్థచేత సమగ్రమైన న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైన నిరుద్యోగ యువత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడవాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన జరగాలంటే డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో పేదలంతా సంఘటితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి జిల్లా ప్రచార కార్యదర్శి యారపు రాజబాబు, కార్యదర్శులు లింగంపల్లి మధుకర్, బొడ్డు మహేందర్,  భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్, బి.ఎస్.పి నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటిపెల్లి అంజయ్య, పట్టణ కన్వీనర్ అన్నల్ధాస్ భాను, బివిఎఫ్ నియోజకవర్గం కన్వీనర్ కోలపురం సురేష్, న్యాలకంటి లక్ష్మీరాజం,ఎడ్లరాజు,తడుక భాను, మేర్గురాజు, రాజేశం,కొంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు