సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముందుగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించారు అనంతరం రంగళంపల్లి చౌరస్తాలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా దశాబ్ద ప్రగతిని వివరించారు. అంతకుముందు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు  సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆవిష్కరించారు.జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట జెడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కమిషనరేట్ ఎదుట అడిషనల్ డీసీపీ మహేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

దుబ్బాకలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని పురపాలక సంఘాల కార్యాలయం ఎదుట చైర్పర్సన్లు, మండల పరిషత్ కార్యా లయాల ఎదుట ఎంపీపీ అధ్యక్షులు, గ్రామ పంచాయతీల ఎదుట సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయం ఎదుట అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావుతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టరులు శ్రీనివాస్ రెడ్డి, ముజామిల్ ఖాన్, ట్రైనింగ్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాటు జిల్లా పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్ జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.