హోమియో మందుతో వడదెబ్బ నివారణ

హోమియో మందుతో వడదెబ్బ నివారణ
  • ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • హోమియో వైద్యులు కాళీ ప్రసాద్

సిద్దిపేట ముద్ర ప్రతినిధి :వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు వడదెబ్బ నివారణ మందు ఎంతో ఉపకరిస్తుందని సిద్దిపేటకు చెందిన ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కొండపాక కాళీ ప్రసాద్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట లోని లయన్స్ భవన్ లో అభయ జ్యోతి, మనో వికాస్ కేంద్రం విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులకు వడదెబ్బ నివారణ హోమయో మందును 40 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, దానివల్ల అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణ నష్టం ఏర్పడుతుందన్నారు.

ముందస్తుగా హోమియో వడదెబ్బ నివారణ మందును వినియోగిస్తే వాటిని అధిగమించవచ్చన్నారు.ఎండల తీవ్రతలు. అధికంగా ఉన్నందున మధ్యాహ్న సమయంలో బయట తిరిగి వద్దన్నారు. తప్పని పరిస్థితిలో బయటకు వస్తే తప్పకుండా తలపై టవల్, క్యాప్ ఏదో హెల్మెట్ ఏదో ఒకటి రక్షణ గా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ ప్రతినిధి జోజి, నిర్మల, అభయ జ్యోతి సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు