మానవజాతి మనుగడ కోసమే డబ్ల్యూహెచ్వో

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: భూమండలంలో మానవజాతి చిరకాలం వర్ధిల్లాడానికి  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ప్రారంభించబడినదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినం పేరిట సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విక్టరీ టాకీస్ నుంచి పాత బస్టాండు పాత బస్టాండ్ నుండి వీర సావర్కర్ చౌరస్తా వరకు  వైద్యులంతా ఈ ర్యాలీలో ప్లే కార్లు చేతబట్టి పాల్గొన్నారు. అందరికీ వైద్యం. అందరి లక్ష్యం.. అందరికీ వైద్యం.. అందరికీ సమానం.. అంటూ ప్లే కార్డులో నినాదాలు ప్రదర్శించారు .ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. 1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఏర్పాటయిందని, అప్పటికే జరిగిన యుద్ధాలు ముగిసిన తర్వాత వ్యాధులు ప్రబలి లక్షలాది మంది ప్రజలు చనిపోతుండడంతో మానవజాతికి ముప్పు ఏర్పడబోతుందని పసిగట్టి వివిధ దేశాలకు చెందిన వైద్యులు ,ప్రభుత్వాలు సుదీర్ఘంగా చర్చించి ప్రపంచ ఆరోగ్య సంస్థను( డబ్ల్యూ హెచ్ ఓ) ఏర్పాటు చేశారని దాని ఏర్పాటు వల్లనే అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశోధనలు వాటి ఫలితాలను పేద దేశాలకు కూడా అందించేందుకు ఒప్పందం జరిగి ప్రస్తుతం అన్ని వ్యాధుల నిర్మూలనకు టీకాలను మందు బిళ్ళలను తయారు చేయడం జరుగుతుందని ర్యాలీలో పాల్గొన్న ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు.

ఈ ర్యాలీలో సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ భాస్కరరావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికాంత్ నాయకులు డాక్టర్ సతీష్ ,డాక్టర్ గణేష్ లతోపాటు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు....