సిద్ధిపేట ఐటీ హబ్ సందర్శించి సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట ఐటీ హబ్ సందర్శించి సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు

ముద్ర ప్రతినిధి : సిద్ధిపేట :నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను శుక్రవారం ఉదయం ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఏస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవిలతో కలిసి ఐటీ టవరులోని ప్రతీ ఫ్లోర్ కలియ తిరుగుతూ సందర్శించి జిల్లా కలెక్టర్, టీఏస్ఐఐసీ అధికారులతో ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష జరిపారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని ఈ నెల జూన్ 15వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను  పరిశీలించిన రాష్ట్ర మంత్రి :హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల సాగునీటి కల త్వరలోనే సాకారం కానున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ తో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజక వర్గంలోని 8.23 టీఏంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను శుక్రవారం సాయంత్రం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ తో కలిసి మంత్రి పరిశీలించారు. అక్కడికక్కడే ఇరిగేషన్ ఇంజనీర్లతో సుమీక్షించి మిగులు పనులు వారంలోపే పూర్తయ్యేలా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూ నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియ పూర్తయ్యిందని, అలాగే 8 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్త పూర్తయిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ఈ ప్రాజెక్టును మరో వారం రోజులలో పూర్తి కానున్నదని, ఫలితంగా గోదావరి జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతోందని తెలిపారు.