గంగను భూమికి తెచ్చిన పురాణ పురుషుడు  భగీరథుడు 

గంగను భూమికి తెచ్చిన పురాణ పురుషుడు  భగీరథుడు 

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

సిద్దిపేట, ముద్ర ప్రతీ నిధి: గంగను భూమి మీదికి తెచ్చిన పురాణ పురుషుడు భగీరథ మహర్షి అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కొనియాడారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ వారి ఆద్వర్యంలో జరిగిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి అదనపు కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతి వేడుకలను అధికారికంగా జరపడాన్ని స్వాగతించారు. పురాణా పురుషులలో, గొప్పవాళ్లలో భగీరథ మహర్షి ముందువరుసలో ఉంటారని గుర్తుచేశారు. ఆకాశం నుండి గంగను భువిపైకి తెచ్చిన గొప్ప యోధుడు.

ఇలాంటి యోధుల గూర్చి ఎంత చెప్పిన తక్కువే. నేటి తరం యువతి యువకులు భగీరథ మహర్షి జీవిత చరిత్ర ను తెలుకోవడం ఎంతో ముఖ్యం. ఇలాంటీ గొప్పవాళ్లను స్మరించుకోవడం మన అందరి అదృష్టం అంటూ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా బట్రాజ్ కుల సంఘ నాయకులు రాజేంద్రప్రసాద్ బట్టు మాట్లాడుతూ భగీరథ మహర్షి ఒక మనిషి కాదు ఒక శక్తి అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాగునీటి పథకానికి మిషన్ భగీరథ అని పేరు పెట్టిందన్నారు. సృష్టిలో జివించాలంటే అత్యవసరమైనది నీరు గంగను ఆకాశం నుండి భుమికి తెచ్చిన గోప్ప శక్తిమంతుడు   భగీరథ మహర్షి అని చెప్పారు భవిష్యత్తు తరాలు సైతం ఈయన చరిత్ర ను తెలుసు కోవాలన్నారు. ఈ వేడుకల్లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి మురళి, సంఘ నాయకులు పాల్గొన్నారు.