రామాయంపేట డివిజన్ కోసం బంద్ సక్సెస్

రామాయంపేట డివిజన్ కోసం బంద్ సక్సెస్

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని  డిమాండ్ చేస్తూ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. డివిజన్ కోసం గత 75 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. అయినప్పటికి  ప్రభుత్వం నుంచి  ఎలాంటి స్పందన రాకపోవడంతో 48 గంటల పట్టణ బంద్ కు పిలుపు నిచ్చారు.

ఈ మేరకు శుక్రవారం వ్యాపారులు స్వచ్చందంగా  షాపులను మూసి బంద్ పాటించారు. కాగా దీక్షల్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కాంగ్రెస్  పార్టీ జిల్లా  అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డిలు వేర్వేరుగా పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని ఇక మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పట్టణ జెఎసి నాయకులు ఉన్నారు.