రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏవి

రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఏవి
  • ఎమ్మెల్యే రఘునందన్ రావు
  • నాణ్యత పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశం

సిద్దిపేట :ముద్ర ప్రతినిధి: కోటి 75 లక్షల వ్యయంతో నిర్మించిన తారు రోడ్డు ఎంత అద్వానంగా ఉంటే ప్రజలకు జవాబు ఏం చెప్తామని దుబ్బాక ఎమ్మెల్యే మాదవ నేని రఘునందన్ రావు అధికారులను ప్రశ్నించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ నుంచి చౌదర్పల్లి గ్రామాల మధ్య నిర్మించిన తారు రోడ్డు నిర్మాణ పనులను శనివారం నాడు ఆయన పరిశీలించారు రోడ్డు నిర్మాణం పూర్తి అధ్వానంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు వెంటనే దీనికి నాణ్యత పరీక్షలు చేయించి రిపోర్టు ఇవ్వాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.