బీభత్సం సృష్టించిన  ఈదురు గాలులు.

బీభత్సం సృష్టించిన  ఈదురు గాలులు.
  • అతలాకుతలమైన గ్రామాలు
  • నెల రాలిన హోర్డింగులు

ముద్ర న్యూస్  రేగొండ: వాతావరణం ఒక్కసారిగా కెన్నెర్ర చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా ఈదురు గాలులు విస్తూ.వడగళ్ల వాన రావడం వల్ల రేగొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడ్డాయి.పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై ప్రభుత్వం నాటిన చెట్లు పూర్తిగా విరిగి పడ్డాయి.

ఆయా పార్టీలకు చెందిన నాయకులు అభిమానంతో ఏర్పాటు చేసిన హోర్డింగులు సైతం నేలకొరిగాయి.ఇక రైతుల విషయానికి వస్తే వరి కోతలు కొస్తూ వరి ధాన్యం కళ్ళల్లో పోస్తున్నారు. వారానికి ఒక్కసారి వర్షాలు కురుస్తుండటంతో కోలుకుని పరిస్థితి లో రైతులు ఉన్నారు.