జగిత్యాల జిల్లా జనరల్ ఆసుపత్రికి  కొత్తగా 42మంది వైద్యులు 

జగిత్యాల జిల్లా జనరల్ ఆసుపత్రికి  కొత్తగా 42మంది వైద్యులు 

జగిత్యాల జిల్లా జనరల్ ఆసుపత్రికి  కొత్తగా 42మంది వైద్యులు 
300 పడకలు, 131 వైద్యులతో సేవలు - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా జనరల్ ఆసుపత్రికి 42 మంది వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల ప్రభుత్వాసుపత్రిని గతంలో ఉన్న 100 నుండి అదనంగా 300 పడకలకి జనరల్ ఆసుపత్రిగా పెరిగిందని ఎక్కడ లేని విధంగా వివిధ ప్రత్యెక నిపుణులు 42 మంది వైద్యులను ప్రభుత్వం మంజూర్ చేయగా 131 వైద్యులతో సేవలు అందనున్నాయని అన్నారు.

పాతాలజిస్ట్,మైక్రో బయాలజీ స్ట్, బాయో కెమిస్ట్,ఎక్స్రేఇస్ట్, కార్డియోలజిస్ట్,న్యూరో,నెఫ్రా లజీస్ట్,ఇండోక్రెనాలజీస్ట్,గ్యస్త్రో ,న్యూరో సర్జన్, జనరల్ మెడిసిన్,పిల్లల వైద్యులు, సర్జన్, ఆర్తో, ENT, గైనిక్, అనస్థీషియా, వైద్యులు ఇలా అనేక మంది వైద్యులు రావడం జరిగిందని దీంతో  ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయిని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా ప్రజలందరి పక్షాన ముఖ్యమంత్రి కేసిఅర్, అరోగ్య శాక మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పి ఎ సి ఎస్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, సీనియర్ నాయకులు బాలేశంకర్, కౌన్సిలర్ వోద్ది శ్రీలత రామ్మోహన్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.