మూడు గంటల విద్యుత్ విధానం కాగ్రెస్ ది, మూడు పంటల విధానం బీఆర్ఎస్ ది...

మూడు గంటల విద్యుత్ విధానం కాగ్రెస్ ది, మూడు పంటల విధానం బీఆర్ఎస్ ది...
  • వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్

వెల్గటూర్, ముద్ర : మూడు గంటల విద్యుత్ విధానం కాగ్రెస్ ది అయితే, మూడు పంటల విధానం బీఆర్ఎస్ ది అని వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ అన్నారు. సోమవారం వెల్గటూర్ లో "రైతు వేదిక" ఎదుట బీఆర్ఎస్ మండల నాయకులు, రైతులతో కలిసి సమావేశం నిర్వహించి "టిపిసిసి అధ్యక్షుడు" రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చేసిన వాక్యలను ఖండించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రైతుల కళ్ళల్లో ఆనందం వికసించిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏడు గంటల విద్యుత్ అందించగా, చాలామంది రైతులు రాత్రి సమయంలో మోటార్ల వద్దకు వెళ్లి విద్యుత్ షాక్ లు, విష పురుగుల బారినపడి ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తే దాన్ని కాంగ్రెస్ నాయకులు జీవించు కోలేకపోతున్నారని అన్నారు. అసత్యపు ఆరోపణలు చేస్తూ, మభ్య పెట్టి పబ్బం గడుపాలని చూస్తే ప్రజలు రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లూరి రామచందర్ గౌడ్, జూపాక కుమార్,నాయకులు పోడేటి రవి, గోలి రత్నాకర్, గూడ రామ్ రెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి మూగల సత్యం, బిడారి తిరుపతి, రంగు తిరుపతి, గుండ జగదీశ్వర్, బందెల నర్సయ్య,కుమ్మరి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.