డిడి ని సస్పెండ్ చేయాలి: సొసైటీ చైర్మన్ ల డిమాండ్

డిడి ని సస్పెండ్ చేయాలి: సొసైటీ చైర్మన్ ల డిమాండ్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించి పాల ఉత్పత్తి పెంచాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న విజయ డైరీ జనగామ జిల్లా డిడి ధనరాజ్ ను సస్పెండ్ చేయాలని కృష్ణాజి గూడెం, ఫతేపూర్, గార్లగడ్డ తండా సొసైటీ చైర్మన్లు సాదం రమేష్, వడ్లూరి వెంకటాద్రి, భూక్య శ్రీనివాసులు ఉన్నతాధికారులను కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 12న జరిగిన సమావేశంలో బీసీయూ సొసైటీ మోడల్ లేదా పి పి సి మోడల్ పై చర్చించినప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అన్నారు.

ఇతర డైరీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టే విజయ డైరీ ఇన్సెంటివ్ సకాలంలో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్ సకాలంలో ఇచ్చి రైతుల పక్షాన ఉండాల్సిన డిడి ఏ.మహేందర్ రెడ్డి, జి. సుగుణమ్మ, ఎల్.మహేందర్, ఏ. ప్రేమ లత, టి.లక్ష్మీనారాయణ కొంతమంది రైతులతో కలిసి పాడి రైతులకు నేరచరిత్ర ఉన్నట్లు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. విజయ డైరీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి జిల్లా డిడి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.