కూనూరు కెనరా బ్యాంకులో చోరీకి యత్నం

కూనూరు కెనరా బ్యాంకులో చోరీకి యత్నం

భువనగిరి జూలై 17 (ముద్ర న్యూస్): గుర్తుతెలియని దుండగులు బ్యాంకులో చోరీకి పాల్పడిన సంఘటన భువనగిరి మండలంలోని కెనరా బ్యాంక్ లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కునూరు కెనరా బ్యాంకులో శనివారం క్లోజ్ చేయగా ఆదివారం సెలవు కావడంతో గుర్తుతెలియనీ దుండగులు చివరికి విపలయత్నం చేసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. కాగా వారు బ్యాంకు పక్కన కిటికీ కి గ్రిల్స్ ను కట్ చేసి తాళం పగలగొట్టారు. బ్యాంకులో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయగా, ఓపెన్ కాకపోవడంతో వేను తిరిగి వెళ్లిపోయారు. బ్యాంకు మేనేజర్ పానుగోతు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు భువనగిరి రూరల్ ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.