కళాకారులను అవమానించిన  కేటీఆర్

కళాకారులను అవమానించిన  కేటీఆర్

ముద్ర, రాయికల్ :-రాయికల్ పట్టణంలోని కళాభవన్ లో జరిగిన సమావేశంలో ఉద్యమ కళాకారులు భూక్క గంగాధర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన మాకు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లు గడిచిన ఎలాంటి న్యాయం జరగలేదు, న్యాయం చేయాలి  అని ఇటీవల జగిత్యాల జిల్లాకు వచ్చిన కేటీఆర్ ను గంగాధర్ నాయక్ కలిసి చేతులు జోడించి అయ్యా మాకు న్యాయం చేయండి అని కోరగా కళాకారులకు ఇప్పటికే 550 ఉద్యోగాలు ఇచ్చామని ఇంకా ఎంతమందికి ఇవ్వాలి అని వ్యగ్యంగా అవమానించినట్లుగా సమాధానం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర ముఖ్యమైనది అని ఓవైపు ముఖ్యమంత్రి అంటుంటే ఆయన తనయుడు కేటీఆర్  మాత్రం కళాకారులపై చిన్న చూపుగా వ్యవహరించడంపై కళాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలం కన్నీరు గళం వేదన పాడితే ఉద్యమాల ఉద్వేగాన్ని ఎవ్వరు ఆపలేరని ఇకనైనా వెంటనే స్పందించి కళాకారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మరియు వారి అర్హతలను బట్టి ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

 లేదంటే తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగ కళాకారులు జేఏసీగా ఏర్పడి ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ న్యాయం కోసం పోరాటం చేస్తాము రాబోవు రోజులలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ పాటల రూపకంగా ప్రజల్లో చైతన్య పరిచేందుకు  మళ్లీ సిద్ధమై ధూమ్ ధామ్ లు చేస్తామని గద్దె దించడానికి పిడికిలెత్తుతామని కళాకారులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు భూక్య గంగాధర్ నాయక్, డప్పు స్వామి, ముంజం రాజు కురిసెంగ ప్రసన్నకుమార్, లక్ష్మీ నర్సయ్య,రవీంధర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.