సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలు స్పూర్తి

సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలు స్పూర్తి
  • జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్
  • కలెక్టరేట్ లో సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాలు స్పూర్తి అని జగిత్యాల జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ డా. గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టర్ సముదాయ కార్యాలయంలో జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  313 వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, అధనపు కలెక్టర్ బిఎస్ లత సర్వాయి పాపన్న చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. డా. చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న  బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి రాజ్యాధికారం సాధించి పెద్దవాళ్లను కొట్టి పేదవాళ్లకు పంచిన మహానాయకుడు అన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ గారు పుట్టుకతోని రాజు కాదని,  మామూలుగా గౌడ కుటుంబంలో జన్మించి కుల వృత్తి చేసుకుంటూ తన చుట్టూ ఉన్న బడుగు బలహీన వర్గాలను కూడగట్టుకుని ఒక మహా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ  ఖిల్లను  ఏలిన మహారాజుగా పేరు ప్రతిష్టలు పొందారని అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సాయిబాబా, మెప్మా ఎఒ దుర్గపు శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ గోప సభ్యులు గుర్రం సత్యనారాయణ , బాలుసాని సత్తయ్య , తిరుమల సదాశివ, చిరంజీవి , నేరెళ్లమల్లేశం, దుర్గపు శ్రీనివాస్, కొత్తకొండ ధీరజ్, నేరాళ్ల కిరణ్, బుర్ర కిషోర్, గొల్లపల్లి రాజు, సంధ్య, సింగం మహేష్, ముష్కం భూమయ్య, కరబూజ రవీందర్, భూసారపు శ్రీనివాస్, పోతుగంటి వెంకటేశ్వర్లు, చిలివేరి గంగాధర్, అనుపురం శ్రీనివాస్,సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ శేకర్, సల్లురి రాజా, రమేష్ , నేరెళ్ళ మల్లేశం, కొత్తాకొండ అంజయ్య, మల్లేశం, రవి తదితరులు పాల్గొన్నారు.