కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టులో భక్తుల రద్దీ

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాకార మండపంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకలు నిర్వహించారు. రద్దీ దృష్ట్యా ఏఈవో బుద్ది శ్రీనివాస్ తగు ఏర్పాట్లు చేశారు.

ప్రతి శని, మంగళవారాల్లో భక్తులకు క్యూలైన్ లో త్రాగునీరు అందిస్తున్నట్లు ఏఈవో తెలిపారు. కాగా, కొండపై భక్తుల వద్ద అక్రమ వసూళ్లు, అధిక ధరలు నియoత్రిoచడానికి, గత తీర్మానం ప్రకారం దుకాణాల  వద్ద ధరల పట్టికలు, మైక్ ద్వారా భక్తులకు సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరినట్లు పలువురు డైరెక్టర్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా, వాహన పూజలకు అధికారులు స్థలం కేటాయించినప్పటికీ, కొందరు అర్చకులు ఆలయం వెనుకాల పూజలు జరపడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. రాత్రి ఆలయం మూసి వేసిన తర్వాత కూడా వాహన పూజలు జరుపుతున్నట్లు తెలిసింది.