సెక్యూరిటీ గార్డులకు.. కనీస వేతనాలు ఇవ్వాలి

సెక్యూరిటీ గార్డులకు.. కనీస వేతనాలు ఇవ్వాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: మార్కెట్ సెక్యూరిటీ గార్డులకు జీవో ఎంఎస్ నెంబర్ 21 ప్రకారం కనీస వేతన చట్టం అమలు, ఈపీఎఫ్, ఈఎస్ఐల, నేరుగా మార్కెట్ కమిటీ నుంచి చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని బుధవారం మార్కెట్ కార్యదర్శి జీవన్ కుమార్ కి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాలుగా మార్కెట్ యార్డులో రైతుకు సేవలు అందిస్తూ ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనాలు లేక సెక్యూరిటీ గార్డులు శ్రమదోపిడికి గురవుతున్నారన్నారు. ఇకనైనా వేతనాలు ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా మార్కెట్ కమిటీల ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ సభ్యులు షరీఫ్, రాంచందర్, వెంకటేష్, కిషన్, పాల్గొన్నారు.