రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్టం లో రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోడిపెళ్లి గోపాల రెడ్డి లు అన్నారు. బీజేపీ కిసాన్  మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జగిత్యాల పట్టణం లో నిర్వహించారు.ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ బూటకపు హామీలతో రెండుసార్లు అధికారం లోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేశారన్నారు. ఏక కాలం లో లక్ష రూపాయల వరకు రైతురుణ మాఫీ చేస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చక పోవడం తో రాష్ట్రంలో రెండు లక్షల యాభైనాలుగు వేల మంది రైతులు అప్పు ఎగవేత దారులు గా గుర్తింపబడడం శోచనీయమన్నారు. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రైతులు అప్పుల పాలు అవుతున్నారన్నారు.కేసీఆర్ మోసపూరిత హామీల వల్ల రైతుల ఆత్మాభిమానం దెబ్బతిని, ఎంతో క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఫసల్ బీమా యోజన ను ప్రవేశ పెడితే కేంద్రానికి మంచి పేరు  వస్తుందని, రాష్రం లో ఆ పథకాన్ని అమలు చేయకుండ రైతుల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

రైతుబంధు ఐదువేలు ఇచ్చి లక్షలాది రూపాయల సబ్సిడీ తో ఇవ్వాల్సిన వ్యవసాయ పరికరాలను రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టాడన్నారని అన్నారు. రైతు బంధు తో బడా భూస్వాములకు లాభం జరుగుతుందే తప్పా చిన్న ,సన్నకారు రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. రైతులను ఆదుకునేందుకు,వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం  ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కిసాన్ మోర్చా నాయకులు,కార్యకర్తల పై ఉందన్నారు. జిల్లాలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాలని, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగదన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10 న అన్ని మండల తాసిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలను నిర్వహిస్తామని తెలిపా రు. ఈ సందర్భంగా పలు వ్యవసాయ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరెడ్డి, బిజెపి నాయకులు రాగిళ్ల సత్యనారాయణ, పన్నాల తిరుపతిరెడ్డి, లక్ష్మీనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు.