జిల్లాలో  వైభవోపేతంగా తెలంగాణ అవతరణ  ద‌శాబ్ది ఉత్స‌వాలు

జిల్లాలో  వైభవోపేతంగా తెలంగాణ అవతరణ  ద‌శాబ్ది ఉత్స‌వాలు
  •  జూన్ 2 నుంచి 22 వరకు రాజన్న జగిత్యాల జిల్లాలో కార్యక్రమాలు
  • జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా  వేడుకలు ఏర్పాట్లు 
  • స్థానిక ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు లు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలి: జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి,జగిత్యాల : జగిత్యాల జిల్లా దశాబ్ది ప్రగతి తో పాటు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. చాటేలా జిల్లాలో  పండుగ వాతావరణంలో వైభవోపేతంగా     నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు  జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల జూన్ 2 నుంచి 22 వరకు జిల్లాలో జరుగు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామల నుంచి జిల్లా స్థాయి  వరకు.. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో నిర్దేశిస్తూ, కార్యక్రమాలను సమన్వయం అధికారులను నియమించినట్లు తెలిపారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలలో  ప్రజాప్రతినిధులందరనీ సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణం లో నిర్వహిస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని  సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈ రోజు నుంచి జూన్ 22 వరకు ప్రత పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్ట్ లు, కళాకారులు,  ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు.