ఎన్ ఆర్ ఐ డిక్లరేషన్ పాలసీ ని అమలుచేయాలి 

ఎన్ ఆర్ ఐ డిక్లరేషన్ పాలసీ ని అమలుచేయాలి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  కాంగ్రెస్ పార్టి ఎన్ ఆర్ ఐ డిక్లరేషన్ పాలసీని ప్రకటించి, మ్యానిఫెస్టో లో పెట్టి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఎన్ ఆర్ ఐ, టిపీసిసి కన్వీనర్ చంద్ పాషా అన్నారు. జగిత్యాల జిల్లా కేద్రంలోని ఇందిరా భవన్ లో మైనారిటీ రాష్ట్ర నాయకులు, ఏ ఐ సీ సీ కార్యదర్శి నదిం జావేద్,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సదర్భంగా   ఎన్ ఆర్ ఐ, టిపీసిసి కన్వీనర్ చంద్ పాషా ఎన్ ఆర్ ఐ పాలసీఫై రాహుల్ గాంధీతో చర్చించి డిక్లరేషన్ చేసి, మ్యానిఫెస్టోపెట్టి యావత్ భారతదశంలో అమలు చేయాలనీ  ఏ ఐ సీ సీ కార్యదర్శి నదిం జావేద్ ను కోరారు.  సానుకూలంగా స్పందించిన ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడి మళ్ళీ వచ్చినపుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యం లో ప్రకటన చేద్దాం పేర్కొన్నారు. అనంతరం 150 పేజీల ఎన్ ఆర్ ఐ రిపోర్ట్ నివేదికను అందజేశారు. ఎన్ ఆర్ ఐ కోర్టు , ఎన్ ఆర్ ఐ హై కమిషన్,  ఎన్ ఆర్ ఐ పోలీస్ , ఎన్ ఆర్ ఐ హెల్ప్ లైన్ సెంటర్ , ప్రతి జిల్లాకు ఆమోదించాలని కోరుతూ , ఈ రిపోర్ట్ ఎన్ ఆర్ ఐ విక్టిమ్స్  కి ఆసరాగా నిలుస్తుందని చాంద్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ కుమార్, యూత్ ప్రెసిడెంట్ మధు, పొలసా నందాయ,  కౌన్సిలర్లు దుర్గయ్య, కమల్ హాబిబ్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ నేహాల్. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .