కొండగట్టులో...  అంగరంగ వైభవంగా.. ప్రారంభమైన పెద్ద జయంతి ఉత్సవాలు...

కొండగట్టులో...  అంగరంగ వైభవంగా.. ప్రారంభమైన పెద్ద జయంతి ఉత్సవాలు...
  • పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్ తిలకించిన వేలాది మంది భక్తులు...
  • స్వామివారికి శేష వస్త్రాలు, తలoబ్రాలు... సమర్పించిన భద్రాచలం ఈవో, ఎమ్మెల్యే

ముద్ర, మల్యాల: తెలంగాణలోనే ప్రసిద్ధి పుణ్య క్షేత్రం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో శుక్రవారం పెద్ద జయంతి (బ్రహ్మోత్సవాలు) ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి... ముందుగా భద్రాచలం ఆలయం నుంచి వచ్చిన శేష వస్త్రాలు, తలoబ్రాలను కొండపైన వై జంక్షన్ నుంచి శోభయాత్రగా ఆలయానికి తీసుకురాగ, అక్కడి ఈవో రమాదేవి, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో, యాగశాలలో వేద మంత్రోత్సవాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, కొండగట్టు ఆలయ ప్రధాన అర్చకులు అమరవాధి విజయరాఘవన్, జితేంద్రస్వామి, స్థానాచార్యులు కపీందర్, అర్చకులు వెంకటరామన్, చిరంజీవి, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, నాయకులు మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, జనగాం శ్రీనివాస్, తాటిపాముల జగదీశ్వర్, బోడ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.