కొండగట్టును సందర్శించిన కవిత

కొండగట్టును సందర్శించిన కవిత
  • ఘనంగా స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు...
  • అంజన్న దర్శనం తర్వాత హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న కవిత

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి  పుణ్యక్షేత్రంను బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమారుతో కలిసి సందర్శించారు. ఆలయ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అర్చకులు కవితకు పూర్ణకుంభ స్వాగతం పలుకగా, అంజన్నను దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు కవితను సత్కరించగా, అర్చకులు ఆశీర్వదిoచి స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఆలయ ఈవో టంకశాల వెంకటేష్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఏ.సాగర్ రావు,  బి.మధుసూదన్ రావు, నాయకులు ఆలయ సూపరిoడేoట్ సునీల్, స్థానచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

హనుమాన్ చాలీసా పారాయణంలో...
కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత భక్తులు, నిర్వాహకులతో కలిసి హనుమాన్ చాలీసా పఠిoచారు. కవిత ఆదేశాల మేరకు గత మూడు సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా పారాయణం జయంతికి ముందు ప్రారంభమై 41 రోజులపాటు కొండగట్టులో విజవంతంగా కొనసాగుతోంది.