'రక్షణ'కు చర్యలేవి..!

'రక్షణ'కు చర్యలేవి..!

ముద్ర, మల్యాల: మండల కేంద్రంలోని సర్పంచ్ ఇంటి సమీపంలో ప్రధాన రహదారిని అనుకోని ఉన్న మిషన్ భగీరథ గేట్వాల్ పైకప్పు శిథిలమైంది. దాంతో గుంత ఏర్పడి, ప్రమాదాలు సంబవించే అవకాశం ఉండడంతో పలువురు పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయితే అది తమ పరిధి కాదని, మిషన్ భగీరథ అధికారులు చూసుకుంటారని సెక్రెటరీ తేల్చి చెప్పినట్లు వారు తెలిపారు. ఏది ఏమైనా ప్రమాదకరంగా మారిన గేట్వాల్ పైకప్పు తొలగించి, మళ్ళీ కొత్తగా పైకప్పు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.