కుల వృత్తులు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం  కృషి

కుల వృత్తులు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం  కృషి
  • జగిత్యాల  ఎమ్మెల్యే డా.సంజయ్
  • సియం కేసిఆర్ చిత్రపటానికి క్షిరాబిషేకం చేసిన రజకులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కుల వృత్తులు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం  కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ సంస్థల దోబీ సేవలను ఇక నుండి రజక సొసైటీలకే కేటాయించాలని ప్రభుత్వం జీవో 102 ను జారీ చేయగా ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రజక సంఘం అధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ల చిత్రపటాలకు క్షిరాబిషేకం చేసి ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులు అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ మధ్యతరగతి విద్యార్థులకు గురుకుల పాఠశాలల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రజకుల కుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో కృషి చేస్తుందని అన్నారు. నిరుపేదలు ఆత్మ గౌరవం తో ఉండడానికే డబల్ బెడ్ రూం  ఇండ్ల నిర్మాణం చేపట్టామని త్వరలోనే డబల్ ఇండ్ల పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంస్థలలో  కుల వృత్తులు వారికే దోబి సేవలు కల్పించాలని రజకులకు  జీఓ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధుక్షుడు మతలపురం శంకర్, నాయకులు పెద్దింటి రాజు, రాజ గంగారాం, బోరగల్ల రాజేశ్వర్, మరిపెల్లి నారాయణ, సట్ట రవీందర్, మరిపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.