జగిత్యాల పట్టణానికి ప్రతి నెల రూ. 5 కోట్ల సంక్షేమ నిధులు

జగిత్యాల పట్టణానికి ప్రతి నెల రూ. 5 కోట్ల సంక్షేమ నిధులు

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణనికి ప్రతి నెల రూ.5 కోట్ల నిదులు వివిధ సంక్షేమ పతకాల ద్వారా వస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమారు అన్నారు. జగిత్యాల పట్టణ 7వ వార్డులో టీయూఎఫ్ఐడిసి నిధులు రూ. 19 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ. 4 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో రూ. 1.17కోట్ల   అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి,అనంతరం పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డు లను ప్రారంభించి, అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్బగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పట్టణంలోని గోవింద్ పల్లి లో ఇళ్ల అనుమతులు వచ్చేవి కావని కానీ జోన్ల మార్పు చేసి నేడు ఇళ్ల అనుమతుల సులభతరం చేశామని అన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇష్టానుసారంగా  డ్రైనేజీలు,రోడ్ల నిర్మాణం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు వల్లేపు రేణుక మొగిలి, ప్రేమలత సత్యం, కమిషనర్ డా.నరేష్, జెడ్పీటీసీ రాజేందర్, కో ఆప్షన్ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, హెచ్ సిఎ  జిల్లా మెంబర్ దావా సురేష్, రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, సర్పంచ్ దూమల తిరుపతి, ఎంపీటీసీ సౌజన్య తిరుపతి, సర్పంచుల ఫోరం చెరుకుజాన్ తదితరులు పాల్గొన్నారు.