కుక్కకు వినతి పత్రం

కుక్కకు వినతి పత్రం

కుక్కకు వినతి పత్రం ఇచ్చి ఎబివిపి వినూత్న నిరసన తెలిపిన....

ముద్ర ప్రతినిధి, జగత్యాల: జగత్యాల మండల వనరులు కేంద్రం యం.ఆర్.సి. కార్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కుక్కకు వినతి పత్రం అందించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల నగర కార్యదర్శి మధురవాడ నందు మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు నూతన విద్యా సంవత్సరనికి బుక్స్, స్కూల్ యూనిఫామ్ పేరుతో ఒక్కొక్కరి పై పదిహేను వేల రూపాయల భారం వేస్తున్నారని, అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ చైతన్య స్కూల్ అడ్మిషన్లు, క్లాస్ లు నడుస్తున్నాయని DEO ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఎలాంటి ఫిర్యాదు తీసుకొనని ఎవరికి చెప్పుకున్న పర్లేదని అన్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. కార్పొరేటు ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రేమ చూపిస్తున్నారని, వినతి పత్రం అందిస్తామని కార్యాలయనికి వస్తే ఎంఈఓ లేకపోవడంతో కుక్కకు వినతి పత్రం అందించి తమ సమస్యను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవిపీ జోనల్ ఇంచార్జ్ అంజలీ, రాజేష్, ప్రశాంత్, వినిత్ తదితరులు పాల్గొన్నారు.