నకిలీ ఎస్టి సర్టిఫికెట్ పై విచారణ జరపండి

నకిలీ ఎస్టి సర్టిఫికెట్ పై విచారణ జరపండి

మహదేవపూర్, ముద్ర: మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మామిడాల శారద అనే వ్యక్తి కార్యాలయంలో నకిలీ ఎస్టీ సర్టిఫికేట్ పొందిందని దీనిపై విచారణ జరిపి పరచాలని జిల్లా నాయకపోడు ఆదివాసి సేవా సంఘం అధ్యక్షులు గొట్టం భూమయ్య, బి పోచయ్య, సుంకర మల్లేష్ విలేకరుల సమావేశంలో ఆరోపించారు.

చింతకాని గ్రామంలో మున్నూరు కాపు కుటుంబంలో జన్మించి సూరారం గ్రామానికి చెందిన రేషన్ షాప్ డీలర్ గా నియమింపబడిందని, పోడు భూమిని కూడా పొందడానికి ప్రయత్నిస్తున్నదని వీరు ఆరోపించారు. నాయకపోడు ఆదివాసీలకు చెందిన రిజర్వేషన్ ఫలితాలను ఇతరులు అనుభవించడం అన్యాయమని వెంటనే ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని వీరు డిమాండ్ చేశారు.