చంద్రయాన్ -3 నమూనా ప్రదర్శన 

చంద్రయాన్ -3 నమూనా ప్రదర్శన 

మెట్‌పల్లి ముద్ర:- మండలం లోని జగ్గసాగర్ గ్రామంలో మాతృ శ్రీ విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రాకెట్ నమూనాతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం విద్యార్థులకు చంద్రయాన్ ప్రయోగం ద్వారా జరిగే ప్రయోజనాలను ఉపాద్యాయులు వివరించారు. భారతదేశం గొప్ప ప్రయోగాలకు పుట్టినిల్లు అని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, ఉపాద్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.