25 లోపు కొండగట్టులో పనులు ప్రారంభం - ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 

25 లోపు కొండగట్టులో పనులు ప్రారంభం -  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 
  • దేశంలోనే చెప్పుకునే విధంగా హనుమాన్ ఆలయం..
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొండగట్టుకు శనివారం సంతోష్ కుమార్ రాక...

ముద్ర, మల్యాల:-ఈ నెల 25 లోపు కొండగట్టులో సీఎం కేసీఆర్ ప్రకటించిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే కొండగట్టులో విలేకరులతొ మాట్లాడారు. కొండ కింద గల సంతోళ్లలొద్దికి వరదకాల్వ నుంచి లిఫ్ట్ పనులను ప్రారంభించి, శ్రావమాసంలో మిగతా పనులకు భూమి పూజ జరుపనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే చెప్పుకునే విధంగా హనుమాన్ ఆలయం కొండగట్టులో రూపుదిద్దుకోబోతుందని ఎమ్మెల్యే అన్నారు. కొండగట్టును గొప్ప క్షేత్రంగా తీర్చి దిద్దాలనే ఆకాంక్షతొ సీఎం కేసీఆర్ 100 నుంచి 500 కోట్లు ఇవ్వడానికి హామీ ఇచ్చారన్నారు.

  •  కోటి 4 లక్షలతొ గ్రీన్ ఇండియా ఛాలెంజ్...

సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన హరితహారంకు స్ఫూర్తిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం శనివారం కొండగట్టు ప్రాంతంలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాను దత్తత తీసుకున్న కీసర తరహాలో కొండగట్టులో కూడా ప్రకృతి సంపద పెంచే విధంగా సంతోష్ కుమార్ మొదటి విడతగా కోటి 4 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారికoగా కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని, నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మోహన్ రావు, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, బద్దం తిరుపతి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ముత్యాల రాoలింగారెడ్డి, మధుసూదన్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, నాయకులు రాజనర్సింగరావు, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, ఆసం శివ, పోతరాజు శ్రీనివాస్, మంద నాంపల్లి, గడ్డం రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

  •  అంజన్న సన్నిధిలో పూజలు...

కొండగట్టు వచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్ అంజన్నను దర్శించుకొని, పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు సత్కరించగా, అర్చకులు ఆశీర్వదిoచి స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేష్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, డైరెక్టర్లు కొంక నర్సయ్య, ప్రవీణ్, లింగాగౌడ్, అర్చకులు పాల్గొన్నారు.