రెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం..

రెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం..

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరునాగారం మండలంగా కొనసాగగా, స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే సీతక్క ఇటీవలె సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ మేరకు కేసీఆర్‌ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ములుగు డివిజన్‌లో గోవిందరావుపేట, వెంకటాపూర్‌, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నది. ఇదిలా ఉండగా ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నది.