సేవే మార్గం.. అభివృద్ధే లక్ష్యం..

సేవే మార్గం.. అభివృద్ధే లక్ష్యం..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:సేవే మార్గం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పయనించడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలో రూ.34కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను సోమవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా భూపాలపల్లి మున్సిపాలిటీనీ ఏర్పాటు చేసుకున్నామని, మున్సిపాలిటీగా రూపాంతరం చెందే ప్రక్రియలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని స్థిరమైన స్థానాన్ని కల్పించుకోవడం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత దిన దిన అభివృద్ధి చెందుతుందని, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక దృష్టితో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, గతంలో కంటే నేడు మెరుగైన అభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా భూపాలపల్లిని తీర్చి దిద్దే సంకల్పంతో ముందుకు వెళ్దామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భూపాలపల్లిలో ఇండోర్, ఔట్ డోర్ స్టేడియం నిర్మాణాలు జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతుందని, ప్రధాన సమస్యగా ఉన్న నీటి సమస్య పూర్తిగా నిర్మూలించుకుని ప్రతి వార్డులో నీరు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని గుర్తు చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, అందుకే భూములకు మంచి ధరలు పలుకుతున్నాయని తెలియజేశారు. అదేవిధంగా ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేసుకోవాలంటే ఆలోచించే పరిస్థితులు ఉండేవని, తెలంగాణలో ప్రస్తుతం వైద్య రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ దవాఖానలపై ఒక నమ్మకాన్ని కల్పించి అందుబాటులోకి కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవలను అందిస్తోందని తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా, కులం, మతం తేడా లేకుండా అమలు చేయడం జరుగుతుందని, ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువస్తానని చెప్పినా అప్పట్లో  ఎవరు నమ్మలేదని, ముఖ్యమంత్రి కేసిఆర్ సహాయ సహకారాలతో  ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు కావడం జరిగిందన్నారు. ప్రస్తుతం భూ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

వచ్చే ఏడాదిలో భూపాలపల్లి పట్టణం ట్రాఫిక్ రహిత పట్టణంగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి అభివృద్ధిలో సింగరేణి బొగ్గు కార్మికుల కృషి కూడా ఉందని, సింగరేణి కార్మికులను ఇటీవలె కొంతమందిని డిస్మిస్ చేస్తే ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో వర్షాల కారణంగా పట్టణంలో నీటి మయం కాకుండా  రూ.102 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరిగిందని, త్వరలోనే ఎంత పెద్ద వర్షం వచ్చిన ఒక్క నీటి బొట్టు ఆగకుండా చూసే బాధ్యత నాదని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.