కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి- జాయింట్ కలెక్టర్ స్వర్ణలత..

కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి- జాయింట్ కలెక్టర్ స్వర్ణలత..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావలసిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ స్వర్ణలత ఆదేశించారు. జిల్లాకేంద్రంలో మంగళవారం యాసంగి వరి ధాన్యం సేకరణపై వివిధ శాఖల అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ

వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని, రైతులకు నీడ సౌకర్యం, నీటి సదుపాయం కల్పించాలన్నారు. మహిళా రైతుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్యాడి క్లీనర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. టార్పాలిన్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటా లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం తేమ శాతం చూసి, తేమ శాతం రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు జారీ చేసిన టోకెన్ల ఆధారంగా నాణ్యతా క్రమంలో కొనుగోలు చేయాలని, తేమ శాతం 17 వచ్చినా ధాన్యం కాంటా వెంటనే వేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ పిడి పురుషోత్తం, జిల్లా సివిల్ సప్లై అధికారి ఎండి వాజిద్ అలీ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రాఘవేందర్ తో పాటు సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు పాల్గొన్నారు.