భూపాలపల్లి హై స్కూల్ లో మాక్ పోలింగ్..

భూపాలపల్లి హై స్కూల్ లో మాక్ పోలింగ్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ హై స్కూల్ లో గురువారం ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల సిబ్బంది మాక్ పోల్ నిర్వహించారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 9 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు.