డబ్బులతో పట్టుబడ్డ మహిళా సంఘ ఉద్యోగి...

డబ్బులతో పట్టుబడ్డ మహిళా సంఘ ఉద్యోగి...

ముద్ర,చొప్పదండి: ఎన్నికల పోలింగ్ సమీస్తుండటంతో నాయకులు డబ్బులు పంచే పనిలో పడ్డారు. చొప్పదండి మండలం లోని రుక్మపూర్ లో ఓ మహిళా సంఘాల ఉద్యోగిని తన ఇంట్లో మహిళలకు డబ్బులు పంచుతున్నారని సమాచారం అందగా ఫ్లయింగ్ స్క్యాడ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. సుమారు రూ. 84730 నగదు పట్టుకున్నట్లు వారు తెలిపారు. పట్టుబడిన నగదును జిల్లా గ్రీవెన్స్ సెల్ కి అప్పగించినట్లు వివరించారు. ఎలక్షన్లు ముగిసిన తర్వాత సరైన ఆధారాలు చూపి తమ డబ్బును తిరిగి తీసుకువెళ్లాలని సూచించినట్లు సమాచారం.