అయ్యప్పభక్తులకు ముస్లిం సోదరుడు అన్నదానం

అయ్యప్పభక్తులకు ముస్లిం సోదరుడు అన్నదానం

తుర్కపల్లి, ముద్ర : అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు ఆదివారం ఎండీ.బురాన్ అన్నదానం చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు.తుర్కపల్లి మండలకేంద్రంలో కులమతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గురు స్వాములు తెప్పరం నాగేష్, తెప్పరం బ్రహ్మము, జూపల్లి గణేష్, బోయిని కుమార్, స్వాములు కూరెళ్ల సందీప్,అన్నోజు సిధాయ్య,కూరెళ్ల వినోద్, అన్నోజు కిరణ్, కూరెళ్ల శ్రీను,గంగారాబోయినకార్తీక్, తదితరులు స్వాములు పాల్గొన్నారు.