నామినేషన్ కు ముందు ఎమ్మెల్యే పూజలు..

నామినేషన్ కు ముందు ఎమ్మెల్యే పూజలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:నామినేషన్ కు ముందు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు గురువారం వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా మంజూరు నగర్ లోని వేంకటేశ్వర స్వామి, కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహస్వామి, చెల్పూర్  శివాలయం, భూపాలపల్లి పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి లు పార్టీ కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించి, కోరిన కోర్కెలు తీరేలా మొక్కులు చెల్లించారు. పుజల అనంతరం నామినేషన్ వేయడానికి బయలుదేరి వెళ్లారు.  ఈ కార్యక్రమంలో ఆయా మండలాల  ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.