భూపాలపల్లిలో నామినేషన్ వేసిన ఎమ్మెల్యే గండ్ర..

భూపాలపల్లిలో నామినేషన్ వేసిన ఎమ్మెల్యే గండ్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ సాదారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా  మధ్యాహ్నం గం. 11: 38 నిమిషాలకు ఎన్నికల రిటర్నింగ్ రమాదేవికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి, బస్వరాజు సారయ్య, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు ఉన్నారు.