గృహాలక్ష్మి గృహాల ఎంపిక బి ఆర్ ఎస్ నేతల చేతిలో అసలైన పేదలకు గృహాలు అందేనా?

గృహాలక్ష్మి గృహాల ఎంపిక బి ఆర్ ఎస్ నేతల చేతిలో  అసలైన పేదలకు గృహాలు అందేనా?

ముద్ర న్యూస్ రేగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మీ పతాకం ఎంపిక ఇప్పుడు బి ఆర్ ఎస్ నేతల చేతిలోకి చేరింది.రేగొండ మండలం రూపిరెడ్డీ పల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా ఎంపిక చేస్తున్నారు. అందులో వారి వారి బంధువులకు పార్టీ ముఖ్య నేతలకు కేటాయిస్తున్నారు.అసలు సిసలైన నిరుపేద కుటింబికులకు అందుతాయి అందయా అనేది చర్చనీయ అంశంగా మారింది.గ్రామములో దాదాపుగా వంద నుండి నూట ఇరవై వరకు అప్లికేషన్ వచ్చినట్టు సమాచారం అందులో గ్రామానికి పది నుండి పన్నెండు వరకు గ్రామానికి అర్హులైన పేదలకు ఇళ్ళు నిర్మించి ఈవ్వాలనేది స్థానిక ఎమ్మెల్యే ఉద్దేశం కానీ గ్రామాల్లో వారి ఉనికి చాటుకోవడానికి కొంత మంది బడా లీడర్లు వారి కుటుంబ సభ్యులకు బంధువులకు కుల నికి కేటాయిస్తున్నారు. కానీ గ్రామానికి చెందిన నిరుపేదలకు గృహాలక్ష్మి అమలు చేయాలని కోరుకుంటున్నారు.కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేక పూరి గుడిసేలో ఉంటున్న తమ దిన స్థితి కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన వారికి గృహాలక్ష్మి వర్తింప చేయాలని అధికారులను వేడుకుంటున్నారు..