అభివృద్ధి చేసే పార్టీ కి ఓటు అడిగే హక్కు ఉంది...

అభివృద్ధి చేసే పార్టీ కి ఓటు అడిగే హక్కు ఉంది...
  • పని చేయని ప్రతిపక్షాలు ముచ్చట్లు చెప్పాడానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది..
  • మన ఊరు మన రమణన్న కార్యక్రమంలో రేగొండ మండలం రేపకా గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర దంపతుల పర్యటన.

ముద్ర న్యూస్ రేగొండ: మన ఊరు మన రమనన్న కార్యక్రమంలో భాగంగా రేగొండ మండలం రేపకా గ్రామంలోని బోగి కుమార్, ఇంట్లో పల్లె నిద్ర చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర , మాట్లాడుతు.  రానున్న ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే క్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించడం సీఎం కేసీఆర్ కి  పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  మన ఊరు మన రమణన్న,కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి,తో కలిసి గ్రామంలో పర్యటించారు. స్థానిక గ్రామ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే  మాట్లాడుతు...
- నాకు అవకాశం కల్పించడంలో ముఖ్య భూమిక పోషించిన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. - ప్రకటించిన తొలి రేపకా గ్రామములో వారంలోనే పర్యటించడం చాలా సంతోషంగా ఉంది.  రానున్న ఎన్నికల్లో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ సిరికొండ మధుసూదనాచారి  నాయకత్వంలో ముందుకు వెళ్దాం.  ఎన్నిక ఏదైనా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఎన్నిక తథ్యం.. పోరాడి సాధించిన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పార్టీ ఓటు అడగడంలో వెనక్కి వెళ్ళదు... ప్రతిపక్ష పార్టీల నాయకులు మాటలు చెప్పడానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది.

ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి,విజ్ఞతతో వారికి సమాధానం చెప్పాలి. రేగొండ మండలాన్ని గతంలో కంటే మెరుగ్గా  అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత.బిఅరెస్ ప్రభుత్వనికి దక్కుతుంది.  మన ఊరు మన రమణన్న కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రజలను,కార్యకర్తల ను నేరుగా కలుస్తాం.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అంకం రాజేందర్, మటిక సంతోష్, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ,గ్రామ సర్పంచ్ పోనగంటి తిరుపతి,ఎంపీటీసీ వెంగల సుజాత నర్సయ్య, స్థానిక మండలం ప్రజా ప్రతినిధులు,మోడెమ్ ఉమేష్ గౌడ్,హింగే మహేందర్,కోలేపక భిక్షపతి, ఐలయ్య,కొండల్ రెడ్డి,పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.