ప్రజల కష్టాలకు పరిష్కారమే గ్యారెంటీ పథకాలు

ప్రజల కష్టాలకు పరిష్కారమే గ్యారెంటీ పథకాలు
  • మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మహాదేవపూర్, ముద్ర: ప్రస్తుతము గ్రామాలలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కష్ట నష్టాలకు సోనియా గాంధీ చూపించిన పరిష్కారమే ఆరు గ్యారెంటీ పథకాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన పథకాల అమలు కొనసాగిస్తున్నామని తెలిపారు. మండలంలోని సూరారం గ్రామ ప్రజలకు  6 గ్యారెంటీ పథకాలను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇంటింటికి తిరుగుతూ వివరించారు. అధికారంలోకి వచ్చిన100 రోజుల్లో పథకాలు పక్కాగా అమలు చేస్తమన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ప్రస్తుత పథకాలు కూడా అమలవుతాయని హర్షద్వానాల మధ్య తెలిపారు.


మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో మహిళకు ప్రతినెలా రూ.2500లు, 500 కే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా కింద ప్రతి ఏటా 15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.గృహాజ్యోతి క్రింద ప్రతి ఇంటికి 200యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఐదులక్షల రూపాయలు అందించనున్నామన్నారు