ఎర్ర బంగారంతో 80 వేలకు ఎగబాకిన కౌలు..  ధైర్యంగా రైతుల వాణిజ్య పంటల సాగు

ఎర్ర బంగారంతో 80 వేలకు ఎగబాకిన కౌలు..  ధైర్యంగా రైతుల వాణిజ్య పంటల సాగు

మహాదేవపూర్, ముద్ర: మిర్చి సాగు చేసే రైతులు ఈ ఏడాది ఎకరా మెట్ట భూమికి 80 వేల రూపాయల కవులను చెల్లించడానికి వెనుకాడడం లేదు. ఇతర ప్రాంతాలలో ఎకరాకు కౌలు లేదా మునావ క్రింద j30000 మించి చెల్లించే పరిస్థితి లేదు.  గోదావరి పరివాహక ప్రాంతంలోని మహాదేవపూర్ మండలంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి. 70వ దశకం నుండి 2000 వరకు ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రైతులు వర్జీనియా పొగాకుతో కాసులను పండించుకున్నారు. ఆంధ్ర రైతులు వెళ్లిపోయిన వాటి నుంచి వ్యవసాయం చేపట్టిన తెలంగాణ రైతులు మహాదేవపూర్ మండలంలో భూమిని బట్టి 40 వేల నుండి 80 వేల వరకు కౌలు చెల్లిస్తున్నారు. ఇంత మొత్తంలో చెల్లించే ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఎర్ర బంగారంగా పిలువబడే మిర్చి పంట సాగులో మహాదేవపూర్ మండలం పేరెన్నికగన్నది.

గత రెండు దశాబ్దాలుగా మిర్చి పంట లో స్థానిక రైతులు ఆరితేరిపోయారు. సుమారు 2000 ఎకరాలను ఎకరాలలో మిర్చి పంట వేస్తారు. వండర్ హాట్, త్రీ ఫోర్ వన్, నంబర్ ఫైవ్, బాడిగ, తేజ తదితర రకాలను వీరు పండిస్తారు. వండర్ హాట్ క్వింటాలుకు 28 వేల నుండి 38,000 ధర పలుకగా ఎకరాకు 15 నుండి 20