మోడల్ స్కూల్ లో భారీ కొండచిలువ

మోడల్ స్కూల్ లో భారీ కొండచిలువ

కాటారం, ముద్ర న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మోడల్ స్కూల్లో సోమవారం రాత్రి భారీ కొండ చిలువ కలకలం రేపింది. ఆంజనేయ స్వామి మాల ధరించిన భక్తులు పూజ అనంతరం మోడల్ స్కూల్ ఆవరణలో నిద్రిస్తున్నారు. అదేసమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండ చిలువ స్వాముల వద్దకు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్వాములు కొండ చిలువ విషయం మోడల్ స్కూల్ వాచ్ మెన్ కి సమాచారం అందించారు.వెంటనే అక్కడికి వచ్చిన వాచ్ మెన్ దానిని చంపి వేశాడు.కాగా ప్రభుత్వం ఇటీవలే అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.మోడల్ స్కూల్ కు వేసవి సెలవలు కావడంతో పాఠశాలలో విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళారు.విద్యార్థులు లేక పోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.మోడల్ స్కూల్ కి అనుకొని దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పాములతో పాటు అడవి జంతువులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.అధికారులు తగు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు కోరుతున్నారు.