కాళేశ్వరం లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

కాళేశ్వరం లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

మహాదేవపూర్,ముద్ర: మండల కేంద్రంలోని అన్నారం, నాగెపల్లిలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల గురించి గడపగడపకు  తిరుగుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, గుడాల శ్రీనివాస్, దాబాడే బాలాజీ ఆధ్వర్యంలోవివరించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచినీల్ల దుర్గయ్య, గుర్సింగ బాపు, చేకుర్తి శంకర్, నగేశ్ యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.