మసీదుల వద్దకు చేరుకున్న రాజకీయ పార్టీలు

మసీదుల వద్దకు చేరుకున్న రాజకీయ పార్టీలు

మహాదేవపూర్, ముద్ర: శుక్రవారం కావడంతో కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు సంబంధించిన నాయకులు నమాజ్ అనంతరము ముస్లింలను కలుసుకొని ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. మహాదేవపూర్ లో మూడు మసీదులు ఉండగా మసీదుల వద్ద ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు చేరుకుని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీపీ రాణిబాయి, సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ ఎనమండ్ర వామన్ రావు, కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మథీన్ ఖాన్, కటకం అశోక్, వరప్రసాద్, చేకుర్తి శంకర్ తదితరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ బాబుకు ఓటు వెలిసి గెలిపించాల్సిందిగా ముస్లిం సోదరులను కోరారు. అనంతరం వీరు మైనారిటీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.

ముస్లింలను ఓటు అభ్యర్థించిన బిఆర్ఎస్ నాయకులు

శుక్రవారం నాడు మహాదేవపూర్ మండల కేంద్రంలోని మూడు మసీదుల వద్ద టిఆర్ఎస్ నాయకులు బృందాలుగా ఏర్పడి ముస్లింలను బిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరిలో మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాపు, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు ఆన్కారి ప్రకాష్, పెండ్యాల మనోహర్, కాళేశ్వరం ధర్మకర్త కలికోట దేవేందర్, జాడి గట్టయ్య, అహంకారి ప్రభాకర్, లింగాల రామయ్య, చకినారపు చందు, ఐలయ్య యాదవ్, పోత వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలను కలిసిన మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి

ముస్లింలలో ప్రత్యేక అభిమానాన్ని చూడకుండా మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ట రామ్ రెడ్డి శుక్రవారం పురస్కరించుకొని మహాదేవపూర్ లో అన్ని మసీదులను పర్యటించడంతోపాటు గ్రామంలోని మైనార్టీ పెద్దలను కలుసుకున్నారు. బిజెపి అభ్యర్థి చంద్రుపాట్ల సునీల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ముస్లింలు రామ్ రెడ్డిని ఆప్యాయంగా ఆదరించారు. రామ్ రెడ్డి తో పాటు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీధర్, మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షులు అన్కారి రాజేందర్, కార్యదర్శి మంథిని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.