మంద చూపు ఎటువైపు..? - బీఆర్ఎస్ లో ఇమడలేక కాంగ్రెస్ వైపేనా..!

మంద చూపు ఎటువైపు..? - బీఆర్ఎస్ లో ఇమడలేక కాంగ్రెస్ వైపేనా..!

ముద్ర, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామానికి చెందిన మంద సాంబయ్య గతంలో బిజెపి మండల అధ్యక్షుడిగా,  భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా ఒక వెలుగు వెలిగి..ఆ తర్వాత మాజీ స్పీకర్..ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నాయకత్వంలో బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో మధుసూదనాచారి గెలుపుకై విశేష కృషి చేశారు. కాగా 2018లో మధుసూదనాచారిపై, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గండ్ర వెంకటరమణ రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది..అభివృద్ధి పేరుతో..అధికార బీఆర్ఎస్ లో చేరగా..అప్పటి నుండి మంద సాంబయ్య స్తబ్దతగా ఉంటున్నాడు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో..కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దీంతో తన అనుచరులు, గత 20 సంవత్సరాలుగా తనతో పని చేసిన తోటి సన్నిహితులు  కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా మంద సాంబయ్యపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. తన అనుచరులు, సన్నిహితుల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంద సాంబయ్య పునరాలోచనలో పడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంద సాంబయ్య కాంగ్రెస్ పార్టీలో చేరితే నియోజకవర్గంలోని దళిత వర్గాల ప్రజలతో పాటు..విద్యార్థులు, యువకులు కాంగ్రెస్ కు దగ్గర అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.